Published: Nov 20, 2026, 16:35 IST|Updated: Nov 20, 2026, 16:41 IST
Cyclone Akvan Latest Update:బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అక్వాన్' తీవ్ర తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటింది. విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు ఎలాంటి తీవ్ర నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీరం వెంబడి ఈదురుగాలులు సుమారు 50 నుంచి 60 కి.మీ. వేగంతో వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.