ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు. సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.