Published: Nov 20, 2026, 16:50 IST|Updated: Nov 20, 2026, 16:56 IST
MP Avinash Reddy Petrol Bomb News: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ వైఎస్సార్ కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల కోసం వెళ్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగనప్పటికీ, గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.