ఓట్లు వేసిన ప్రజలనే కాదు, ఒట్లు వేసి దేవుళ్లను, పవిత్ర గ్రంథాలను సైతం మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఖర్గే, రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలిందన్నారు. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.