ULC Lands: తెలంగాణలో Urban Land Ceiling (ULC) భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెండింగ్, కొత్త ULC దరఖాస్తులకు వర్తించేలా కొత్త రెగ్యులరైజేషన్ విధానం తీసుకురానున్నారు. రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ ప్రక్రియలను ఏకకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.