బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ మరోసారి అరెస్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ పోలీసులు క్రిషాంక్‌ను అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ కేసులో మన్నె క్రిషాంక్‌తో పాటు మరికొందరిని నిందితులుగా చూపుతూ పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.