Published: Nov 16, 2026, 12:45 IST|Updated: Nov 16, 2026, 13:42 IST
Egg Chicken Price Hike: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు కోడిగుడ్ల ధరలు మరింత భారంగా మారాయి. కార్తీక మాసంలో ధరలు తగ్గుతాయని ఆశించిన వినియోగదారులకు మార్కెట్ ధరలు తీవ్ర షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో నాణ్యత, ప్రాంతాన్ని బట్టి ఒక్కో గుడ్డు ధర రూ. 7 నుంచి రూ. 9 వరకు చేరగా, డజన్ ధర రూ. 90 నుంచి రూ. 108 వరకు పలుకుతోంది. కోళ్ల దాణా ధరలు భారీగా పెరగడం, చలికాలం నేపథ్యంలో డిమాండ్ ఊపందుకోవడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.