Godavari Flood: గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లో అప్రమత్తత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 25న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం భారీగా నమోదవ్వగా, వరద మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.