Published: Sep 27, 2026, 07:45 PM|Updated: Sep 27, 2026, 07:48 PM
Hyderabad Lady SI Humiliated: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు కొనసాగుతున్న క్రమంలో ఓ మహిళా ఎస్సైపై ఆకతాయిలో అసభ్యంగా ప్రవర్తించారు. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్ చేస్తూ.. మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. అయితే అక్కడే ఉన్న ఓ మహిళా ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ ఆకతాయిలను హెచ్చరించింది. దీంతో ఆమె పట్ల పలువురు అసభ్యంగా ప్రవర్తించి ఆమె విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.