నేడు ఇండి కూటమి నేతలు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పార్లమెంట్ నుండి ఈసీ ఆఫీస్ వరకు విపక్ష ఎంపీలు మార్చ్ చేపట్టనున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల చోరీని నిరసిస్తూ పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ఇండియా కూటమి పార్టీల నేతలు ఊరేగింపుగా వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ వైపు వెళ్లే అనేక మార్గాల్లో బారికేడ్లు వేయడం, వేల సంఖ్యలో పోలీసులు మరియు ఇతర బలగాలను మోహరించడంతో అక్కడ పరిస్థితి యుద్ధ వాతావరణంలా ఉంది. న్యూఢిల్లీ జిల్లా అంతటా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాన్ని విధించినట్లు పోలీసులు తెలిపారు.