Published: Nov 19, 2026, 11:10 IST|Updated: Nov 19, 2026, 11:12 IST
Janasena Rukmini Kota Controversy: తన పేరు, సంస్థ పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఓ మాజీ ఉద్యోగిని చేసిన ఉద్యోగాల మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నాయకురాలు కోటా రుక్మిణి స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కొందరు రాజకీయ నేతలు, మీడియా సంస్థలు కావాలనే తనపై కల్పిత కథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ పేరును లాగొద్దని కోరిన ఆమె, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వారిపై చట్టపరంగా పోరాడతానని హెచ్చరించారు.