శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం కేరళ ఆరోగ్య శాఖ కీలకమైన ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. కొండ ఎక్కే సమయంలో భక్తులు అధిక శ్రమకు గురికావద్దని, వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యాత్ర ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకుని, డాక్టర్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల హార్ట్ ఎటాక్ వచ్చినవారు, గుండె శస్త్రచికిత్స లేదా యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారు నిపుణుల సలహా లేకుండా యాత్రకు రావద్దని ఆరోగ్య శాఖ తెలిపింది. బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాలని, రోజూ వాడుతున్న మందులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించింది. మందులతో పాటు