Published: Sep 27, 2026, 07:55 PM|Updated: Sep 27, 2026, 08:51 PM
Lizard In Sambar Tuni Junior College: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాహారం తిని 19 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక తుని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనంలోని సాంబారులో బల్లి పడింది. అది తెలియకుండా విద్యార్థినులు ఆహారం తినగా, వారిలో 19 మంది బాలికలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో హుటాహుటిని ఆస్పత్రిలో చేర్చారు.