Published: Sep 28, 2026, 06:40 PM|Updated: Sep 28, 2026, 06:47 PM
Manikonda Chaddi Gang Theft: హైదరాబాద్ నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. నెక్నాంపూర్‌లోని ఫ్లొటిల్లా అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఉన్న చెరువు వైపున ఉన్న ఫెన్సింగ్‌కు కత్తిరించి మరీ దొంగలు లోపలికి చొరబడ్డారు. మెట్ల మార్గంలో అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అక్కడే ఉన్న కొందరి వ్యక్తులపై చడ్డీ గ్యాంగ్ ఆయుధాలతో దాడికి యత్నించారు.