Published: Sep 30, 2026, 08:05 PM|Updated: Sep 30, 2026, 08:20 PM
Actor Nani In Vijayawada: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే ఈ చిత్రబృందం విజయోత్సవ సభను కూడా నిర్వహించింది. అయితే తాజాగా హీరో నాని విజయవాడలోని కనక దుర్గమ్మ గుడికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.