అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్జీ గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. మూసివేసిన వెల్ నుంచి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో గ్యాస్ వెలువడింది. దీనితో పాటు మరిన్ని భారీ శబ్దాలు వచ్చాయి. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ నిపుణులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండలో భారీ బ్లో అవుట్ జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మామిడికుదురులో భారీ బ్లో అవుట్ సంభవించింది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తరచూ గ్యాస్ లీక్‌లు