konaseema ongc gas leak: గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెద్దాడ - మామిడికుదురు హైవే పక్కనున్న రీ-డ్రిల్లింగ్ బావి నుంచి తెల్లవారుజామున భారీగా గ్యాస్ లీకవుతుండటాన్ని గమనించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 5న ఇరుసుమండ గ్రామంలో ఇదే తరహాలో భారీగా గ్యాస్ లీకై, ఆ తర్వాత మంటలు చెలరేగి బ్లోఅవుట్ ఏర్పడింది. మరోసారి అలాంటి ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం నెలకొంది. కోనసీమలో తరచూ జరుగుతున్న ఓఎన్జీసీ గ్యాస్ ప్రమాదాలు ఈ ప్రాంతాన్ని నిప్పుల కొంపలా మార్చాయి.