Santhoshimata Temple Attack: హైదరాబాద్ నగరంలో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆలయంపై తెగబడ్డారు. దిల్‌సుఖ్ నగర్‌లోని బస్ డిపో పక్కన ఉన్న సంతోషి మాత దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడిలోకి ప్రవేశించి పూజారిపై దాడికి తెగబడ్డారు. అతంటితో ఆగకుండా అమ్మావారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దీంతో వెంటనే భక్తులు అప్రమత్తమయ్యి.. నిందితులను పట్టుకొని పోలీసులకు పట్టించారు.