Published: Oct 01, 2026, 08:20 PM|Updated: Oct 01, 2026, 08:28 PM
Telangana Employees DA News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలంగా నిలిచిపోయిన కరువు భత్యం (డీఏ) చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇటీవలే 2 డీఏలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో దసరాకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ జీతంలో జమ చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. అక్టోబరు నెల జీతంలోనే రెండు డీఏలు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.