Published: Sep 24, 2026, 12:50 PM|Updated: Sep 24, 2026, 12:56 PM
Telangana Employees DA Update: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం వెచ్చిస్తున్న రాబడి శాతం గణనీయంగా తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా జీతాలు ఇస్తోందనే ప్రచారంలో వాస్తవం లేదని, రాష్ట్రం తన రాబడి రసీదుల్లో కేవలం 35 శాతం మాత్రమే ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సుస్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారానికి ఉద్యోగుల జీతాలు కారణం కాదని, విచ్చలవిడిగా అమలు చేస్తున్న ఉచిత పథకాలు, పరిపాలనా దుబారా ఖర్చులే ప్రధాన కారణమని 'డీఎన్ఏ విత్ భరత్' డిబేట్ కార్యక్రమంలో విశ్లేషించారు.