Published: Sep 26, 2026, 04:55 PM|Updated: Sep 26, 2026, 04:56 PM
Telangana Employees PRC Update: రెండు డీఏల ప్రకటన, ఉద్యోగుల ఇతర డిమాండ్లు ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం రెండు డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇవి దసరా పండుగ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపినప్పటికీ, ఆర్థికపరమైన నిర్ణయం కావడం వల్ల క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, డీఏ అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని పండుగ కానుకగా చూడకూడదని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ అన్నారు.