ఈ సందర్భంగా కోటి మంది మహిళలకు చీరల పంపిణీతో పాటు 4,63,857 మందికి చేయూత పెన్షన్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్యాదేవరాజన్కు ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు ఈసారి చిలకపచ్చ చీరలను తయారుచేయించగా అవి జిల్లాలకు చేరాయి. పెన్షన్ పత్రాల పంపిణీ కూడా పూర్తయింది.