Telangana MLC Elections: తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరుగురి పేర్లతో షార్ట్‌లిస్ట్ సిద్ధం చేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లు.. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి మన్నె జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీశ్ పేర్లు హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. తుది అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.