తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠంలోని 10 కంపార్ట్‌మెంట్‌లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటున్నారు. ఉచిత దర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 83,250 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 28,600 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే 4 లక్షల 58 వేల లడ్డూలు, 1 లక్ష 82 వేల అన్న ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు ప్రకటించారు. భక్తుల భారీ రాకతో స్వామివారి హుండీ ఆదాయం రూ. 4 కోట్ల 56 లక్షలు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.