నిన్న రూ.4 లక్షల కోసం టెలిఫోన్ భవన్ వద్ద సునీత వేచి ఉండగా, అక్కడ ముందే ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి రూ.2.5 లక్షల ను బైక్ డిక్కీలో ఉంచాడు. అలాగే ఇంకొకరు రూ. 4 లక్షలు ఇవ్వడానికి రాగా, ఆ డబ్బును కూడా స్కూటీ డిక్కీలోనే వేయాలని సునీత చెప్పింది. ఆ ఇద్దరు వ్యక్తులు డిక్కీలో డబ్బులు వేయగానే ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు అడ్డంగా పట్టుకోగానే, తాను డబ్బు ముట్టుకోలేదని సునీత వాదించింది. కొన్నేళ్లుగా సునీత పలు కేసుల్లో స్కూటీ డిక్కీ ద్వారానే లంచాలు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.