Vikarabad Tiger: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కృష్ణగిరి క్షేత్రం సమీపంలోని గోశాలలో ఆవుపై పులి దాడి చేయడంతో అది మృతి చెందినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఓ లేగదూడను కూడా పులి ఎత్తుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు. ఘటనపై అటవీశాఖ, పోలీసులు స్పందించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ పులి కదలికలను ట్రాక్ చేస్తున్నారు.