Villagers And Farmers Protest At Sub Station: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. 24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేయగా.. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.