Sonu Sood Visits Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు సోనూసూద్ దర్శించుకున్నాడు. ఏపీ పర్యటనకు వచ్చిన సోనూసూద్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం పండితులు అతడికి వేద ఆశీర్వచనం అందించారు.
Girls hair cut row in bheemili kgbv school: భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆరాతీశారు.దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు.
AP Politics: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేతో టీడీపీ కార్యకర్తల రగడ హాట్ టాపిక్ గా మారింది. తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన మహిళా ఎమ్మెల్యే తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇంతకీ అక్కడ ఎమ్మెల్యేపై టీడీపీ క్యాడర్ ఎందుకు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే సారీ చెప్పడంతో అసమ్మతి కథ సుఖాంతం అయినట్టేనా...? నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై టిడిపి అధిష్టానం ఏం చేయబోతుంది...?
PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో పవర్ బిల్లు..! ఇది కేవలం మాటలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు APలో ఇది అక్షరాలా నిజమవుతోంది. విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడమే కాకుండా... భానుడి ప్రతాపాన్నే ఉచిత విద్యుత్‌గా మారుస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న భారీ సబ్సిడీలతో రూఫ్‌టాప్ సోలార్ రంగంలో ఏపీ సీపీడీసీఎల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఉచిత సోలార్ పథకంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.
Gorantla Butchaiah Chowdary: వైసీపీతో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో రగడకు దిగారు..! పేరడీ కవితలు... సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు..! అయితే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ధీటుగా బదులు ఇస్తున్నారు..! ఇంతకీ ఆ రచ్చ ఏంటి...? మంత్రి పదవి కోసమే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల ఆ రూట్ లో వెళ్తున్నారా..! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులైన ఏపీ రైతులకు బిగ్ అలర్ట్! అన్నదాతలు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. అప్పుడే తదుపరి విడత పీఎం కిసాన్ నిధులు మంజూరు అవుతాయి. పీఎం కిసాన్ కింద ఏడాదికి మొత్తం మూడు విడతల్లో రూ. 6000 జమ అవుతాయి. దీనికి ఈ కేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. ఈకేవైసీ https://pmkisan.gov.in/ పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఫార్మర్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజమండ్రి విమానాశ్రయంలో ఏకే-47 (AK-47) రకానికి చెందిన ఒక బుల్లెట్ పట్టుబడటం వల్ల విమానాశ్రయ ప్రాంగణంలో పెద్ద కలకలం రేగింది. ఢిల్లీకి వెళ్లాలనే ఉద్దేశంతో విమానాశ్రయానికి చేరుకున్న ఒక మహిళా ప్రయాణికురాలి లగేజీని భద్రతా నిబంధనల ప్రకారం స్కాన్ చేస్తుండగా, ఆమె బ్యాగులో ఒక బుల్లెట్ ఉన్నట్లు ఎయిర్ పోర్ట్ భద్రతా పర్యవేక్షణలో ఉన్న ఎస్పీఎస్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని ఈ విషయంపై కఠినంగా విచారించారు. అయితే, తనిఖీలు చేసిన అనంతరం అది కేవలం ఒక డెడ్ బుల్లెట్ (ఉరి లేని బుల్లెట్) అని అధికారులు నిర్ధారించారు.
ఏలూరులోని స్వగృహానికి మాజీ మంత్రి ఆళ్లనాని మృతదేహం చేరుకుంది. విశాఖ నుండి ప్రత్యేక వాహనంలో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువచ్చారు. నివాళులర్పించేందుకు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఆళ్లనాని ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానుల సందర్శన కోసం పార్థివదేహాన్ని స్వగృహంలో ఉంచారు.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన కాణిపాకం ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికతతో సాగుతున్నాయి. ఈ వేడుకల క్రమంలో భాగంగా, రాత్రి సమయాన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు అందమైన హంసవాహనంపై అధిష్ఠించి, భక్తులకు దర్శనమిస్తూ పురవీధుల్లో విహరించారు. వైభవంగా జరుగుతున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు హంసవాహనంపై భక్తులకు దర్శనమిస్తూ విహరించిన వినాయక స్వామి
నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొదటగా ఎస్సై, కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత వెంటనే మరో నాలుగు నోటిఫికేషన్‌లు వివిధ విభాగాల్లో SI, కానిస్టేబుల్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Alla nani Death News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి చెందిన వార్త అత్యంత విషాదకరంగా ఉంది. వైజాగ్ నగరంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించారు.
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని APSDMA అలెర్ట్ చేసింది. వాయువ్యం నుండి నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతున్న ఆవర్తనం కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపూర్, చిత్తూరు, తిరుపతికి వర్ష సూచన పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాల అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏపీ జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tirumala Brahmothsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం వైభవంగా జరిగింది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.