మాజీ మంత్రి ఆళ్లనాని మృతదేహాన్ని విశాఖపట్నం నుండి ఏలూరులోని ఆయన స్వగృహానికి కుటుంబ సభ్యులు తరలించారు. విశాఖ నుండి ప్రత్యేక వాహనంలో ఆళ్లనాని భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. ఆళ్లనాని భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు తరలివస్తున్న ప్రజల వల్ల ఆళ్లనాని నివాస ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు మరియు ప్రజల సందర్శన కోసం పార్థివదేహాన్ని ఆయన స్వగృహంలోనే ఉంచారు.