Rajahmundry Airport: పాలకొల్లు ప్రాంతానికి చెందిన గెడ్డం ఉజ్వల అనే మహిళా ప్రయాణికురాలు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ మీదుగా ఇజ్రాయిల్ వెళ్లాలని నిశ్చయించుకుని ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఆమె వద్ద బుల్లెట్ ఎందుకు ఉంది అనే అంశంపై పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె సమాధానం వెల్లడిస్తూ.. తన కుటుంబ సభ్యులలో ఒకరు గతంలో ఆర్మీలో పనిచేసేవారని, వారు ఇంటికి తెచ్చిన ఆ డెడ్ బుల్లెట్‌ను ఇంట్లోని పిల్లల ఆటవస్తువుగా ఇచ్చారని పేర్కొన్నారు. పిల్లలు తెలియక ఆ బుల్లెట్‌ను తన బ్యాగులో వేసుకున్నారని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, విమానాశ్రయ భద్రతా నియమాలను ఉల్లంఘించిన కారణంగా, అధికారులు ఆమెపై కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి,