సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేత తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా చూడాల్సిన బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానిదేనని ఆయన అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత తెలిపారు.