AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవలే వరుస తుఫానులు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ వైపుగా తరలివస్తుంది. ఈ నెల 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇది సముద్ర తీరానికి చేరువయ్యే కొద్దీ మరింత బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటవచ్చని అంచనా వేశారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది.