రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంట సాగు చేసినా, చేయకపోయినా అర్హులైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసే దిశగా కసరత్తు కొనసాగుతోంది. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకుంటోంది. అదే రోజున రైతులందరికీ ఈ నిధులు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో రుణాల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అర్హులైన రైతులకు రుణాల రీ షెడ్యూల్ చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.