ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది.రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హోచ్చరిస్తోంది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉందంటోంది. ఉదయం వేళల్లో పనులకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.