మొంథా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో ఈరోజు కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం నేడు, రేపు తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో తుపాను కలిగించిన నష్టాన్ని పరిశీలించనున్నారు. పంటలు, ఆస్తుల నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయడంతో పాటు, తుపాను బాధిత రైతులు, ప్రజలతో నేరుగా కేంద్ర బృందం మాట్లాడనుంది. రెండు రోజుల పర్యటన అనంతరం ఈ నెల 15న సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.