ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు తనపై, పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. తాము చేపట్టిన ప్రతి సంస్కరణను సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగను ఘనంగా జరుపుకున్న తీరు తన మనసును ఎంతగానో కదిలించిందని తెలిపారు. హైదరాబాద్ ప్రజలందరూ సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, గుండెనిండా మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీగా సెలవు తీసుకుంటున్నానని సీపీ సజ్జనార్ తెలిపారు.