అల్పపీడనం మరింత బలపడి నవంబర్ 14 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, నవంబర్ 15 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెబుతోంది. అయితే ఇది ఆ తర్వాత ఏ దిశగా పయనిస్తుంది, మరింత తీవ్రమై తుపానుగా మారుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. దీని ప్రభావంతో APలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుపై ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.