Published: Nov 13, 2026, 11:10 AM|Updated: Nov 13, 2026, 11:14 AM
AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) మూడు విడతల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కోర్టు కేసులున్న 186 పంచాయతీలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 13,168 సర్పంచ్ స్థానాలు.. 1,31,848 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు వేసేలా నామినేషన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ వరకు పటిష్టమైన సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు.