Published: Nov 09, 2026, 06:00 PM|Updated: Nov 09, 2026, 06:10 PM
Cyclone Alert To AP: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అర్నబ్, మురసు తుఫానులు తీవ్ర నష్టం కలిగించగా.. ఇప్పుడు తుఫాను ముంచుకొస్తుందని సంకేతాలు అందుతున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. బంగాళఖాతంలో ప్రస్తుతం మరో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. అయితే ఇది తుఫానుగా మారుతుందా? లేదా అనేది మరికొన్ని రోజులు గడిస్తే తెలుస్తుందని వెల్లడించారు. ఏది ఏమైనా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.