Published: Nov 09, 2026, 06:10 PM|Updated: Nov 09, 2026, 06:12 PM
Delhi Train 1286 KGs Meat Mystery: ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ (HNRS) యార్డులో రైలులో వచ్చిన పార్శిల్‌లో అనుమానాస్పద మాంసం గుర్తించడంతో కలకలం రేగింది. 2026 నవంబర్ 8న ఉదయం సుమారు 9 గంటల సమయంలో బరోడా హౌస్‌లోని రైల్వే విజిలెన్స్ యూనిట్ నుంచి రైల్వే పోలీసులకు సమాచారం అందింది. రైలులోని కొన్ని పార్శిళ్ల ద్వారా బీఫ్ (గోమాంసం) తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న దర్యాప్తు అధికారి (IO), ఎస్‌హెచ్‌ఓ ఘటనా స్థలానికి చేరుకుని పార్శిళ్లను తనిఖీ చేశారు. అయితే హైదరాబాద్ నుంచి తరలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.