Published: Sep 19, 2026, 06:35 PM|Updated: Sep 19, 2026, 06:40 PM
Telangana DA PRC DNA With Bharat: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జరుగుతున్న తీవ్ర జాప్యం, ఉద్యోగుల సమస్యలపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ గళంవిప్పారు. ఉద్యోగుల ఆవేదనకు గొంతుకగా మారారు. గత మూడు సంవత్సరాలుగా పిఆర్‌సి ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం, శివశంకర్ కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీ తెలుగు న్యూస్‌లో జరిగిన డీఎన్‌ఏ డిబేట్‌లో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన డిబేట్‌లో డీఏ, పీఆర్సీ ఆలస్యంపై ప్రభుత్వ ఉచితాలే ప్రధాన కారణంగా చూపిస్తున్నారని దాన్ని ఉద్యోగులంతా ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.