కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి చేసిన అమూల్యమైన సేవలను ఆమె కొనియాడారు. ఆమె గాత్రం కేవలం సంగీతం మాత్రమే కాదని, అది ఒక దైవిక అనుభూతి అని అభివర్ణించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎంఎస్ అమ్మ గొప్పతనాన్ని, ఆమె నిరాడంబర జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి భావోద్వేగానికి గురికావడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.