తన విడాకులపై ఆమె ఇటీవల చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు అవుతోందని, తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయంలోనే పవన్, అన్నా లెజినోవా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించడంతో, రేణు దేశాయ్ ముందుగానే హింట్ ఇచ్చారా అనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ప్రముఖ జ్యోతిష నిపుణుడు వేణు స్వామి కూడా ఒక ఇంటర్వ్యూలో, పవన్ మూడో భార్యతో కూడా విడాకులు తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఆ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.