Rajahmundry Airport: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగులో ఏకే-47 రైఫిల్ బుల్లెట్ లభించడంతో కలకలం రేగింది. ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన పాలకొల్లుకు చెందిన ప్రయాణికురాలి బ్యాగులో తనిఖీల సమయంలో బుల్లెట్ గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.