Revanth Reddy Speech: అణచివేత, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931కి చేరుకుని జాతీయ సగటు కంటే 91 శాతం అధికంగా ఉందని, అభివృద్ధి కేవలం అంకెల రూపంలో కాకుండా ప్రజల జీవితాల్లో ప్రతిబింబించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం 20, 616 కోట్లతో రుణమాఫీ, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా రూ.12,385 కోట్ల ఆదా, 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని