Hyderabad Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భం చరిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రజలు చేసిన పోరాటాలను, త్యాగాలను కృతజ్ఞతతో స్మరించుకోవాలని, ఆ చారిత్రక ఘట్టాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.