Gajendra Singh Shekhawat: ఖైరతాబాద్ గణేశ పూజలు చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఈ పవిత్రమైన ఖైరతాబాద్ గణేశుడి ఆశీస్సులు పొందడం తమకు లభించిన అదృష్టమని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలందరి సంక్షేమం, లోక కల్యాణం, శాంతి, సమృద్ధి కోసం ఆయన భక్తితో ప్రార్థించారు. అంతేకాకుండా, 'వికసిత్ భారత్' అనే ఉన్నతమైన లక్ష్యం దిశగా మన దేశం నిరంతరం అభివృద్ధి పథంలో పురోగమించేలా గణేశుడి దీవెనలు కోరారు.