US Tariffs: రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్‌పై కొత్త సుంకాలు విధించే అవకాశం తెరపైకి వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లులో భారత్, చైనాతో పాటు రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే ప్రతిపాదన ఉంది. ఈ పరిణామంపై భారత్ తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటామని తెలిపింది.