సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచినా మహారాష్ట్రలో ఎలాంటి గ్రామాలు ముంపునకు గురికావని, కేవలం నదీగర్భంలోని కొంత భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని తెలంగాణ అధికారులు సాంకేతిక మ్యాప్‌ల ద్వారా వివరిస్తున్నారు. ముంపునకు గురయ్యే భూములకు చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెబుతున్నారు.