గతంలో పుష్ప సినిమా షూటింగ్ సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఇదే రిసార్ట్‌లోని రూమ్స్‌లో బస చేశారు. వీఐపీ రిసార్ట్స్ పేరుతో 12 గంటలకు 20 వేల రూపాయల వరకూ నిర్వాహకులు టూరిస్టుల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం రిసార్ట్స్ నిర్వహించడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. మారేడుమిల్లి రిసార్ట్స్‌లో అగ్నిప్రమాద ఘటనతో ఇక్కడ రాత్రి బస చేసేందుకు పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు.